- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్ వాటాలో వెనకబడ్డ మారుతి సుజుకి, హ్యూండాయ్!
చెన్నై: ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి రిటైల్ వాహన అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే. అందులో ప్రధాన వాహన తయారీ కంపెనీలైన మారుతీ సుజుకి, హ్యూండాయ్‌లు మార్కెట్ వాటాను కోల్పోయాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) మంగళవారం ప్రకటనలో తెలిపింది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా కంపెనీలు తమ వాటాను పెంచుకున్నాయి.
తాజా ఫాడా రిటైల్ డేటా ప్రకారం, గత నెల మారుతి సుజుకి మార్కెట్ వాటా 42.36 శాతం నుంచి 41.40 శాతానికి, హ్యూండాయ్ వాటా 14.95 శాతం నుంచి 13.62 శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో టాటా మోటార్స్ తన వాటాను 13.16 శాతం నుంచి 13.57 శాతానికి, మహీంద్రా గతేడాది 7.06 శాతం నుంచి ఏకంగా 10.22 శాతంతో రెండంకెల వృద్ధికి, కియా ఇండియా 5.27 శాతం నుంచి 6.81 శాతానికి మార్కెట్ వాటాను పెంచుకున్నాయి.
వీటితో పాటు టయోటా కిర్లోస్కర్ మోటార్, స్కోడా ఆటో కూడా తమ వాటాలో గణనీయంగా వృద్ధిని సాధించాయి. హోండా, ఎంజీ మోటార్స్, నిస్సాన్, రెనాల్ట్ కంపెనీల వాటా తగ్గిందని ఫాడా పేర్కొంది.