అదానీ కంపెనీల షేర్లలో పెరిగిన LIC పెట్టుబడుల విలువ!

by Harish |   ( Updated:2023-05-24 17:00:15.0  )
అదానీ కంపెనీల షేర్లలో పెరిగిన LIC పెట్టుబడుల విలువ!
X

ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా దెబ్బతిన్న అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మళ్లీ పెరుగుతున్నాయి. దాంతో అదానీకి చెందిన ఏడు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన బీమా దిగ్గజం ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 5,500 కోట్లు పెరిగి రూ. 44,670 కోట్లకు చేరుకున్నాయి. ఎల్ఐసీ సంస్థకు అదానీ గ్రూప్ కంపెనీల్లో మెరుగైన వాటాలున్నాయి. అందులో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 9.12 శాతం షేర్లను కలిగి ఉంది. వాటి విలువ రూ. 14,145 కోట్లు.

అలాగే, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 4.25 శాతం వాటా బుధవారం నాటికి రూ. 12,017 కోట్లు, అదానీ టోటల్ గ్యాస్‌లోని 6.02 శాతం వాటాల విలువ రూ. 10,500 కోట్లు ఉన్నాయి. మిగిలిన కంపెనీల్లో అదానీ ట్రాన్స్‌మిషన్(3.68 శాతం), అంబుజా సిమెంట్స్‌(6.3 శాతం), అదానీ గ్రీన్ ఎనర్జీ(1.36 శాతం), ఏసీసీ సిమెంట్(6.41 శాతం) కంపెనీల్లోనూ ఎల్ఐసీకి వాటాలున్నాయి.

ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానివల్ల అదానీ స్టాక్స్ ధరలు ముప్పావు వంతు క్షీణించాయి. అందులో పెట్టుబడి పెట్టిన ఎల్ఐసీ కూడా గణనీయంగా నష్టాలను చూసింది. అనంతరం అదానీ సంస్థ నష్ట నివారణ కింద రుణాలను తిరిగి చెల్లించడం, కొన్ని బాండ్లను తిరిగి కొనడం వంటి చర్యలు తీసుకోవడంతో అదానీ షేర్లలో కదలిక వచ్చింది.

ఇటీవల కంపెనీపై వచ్చిన అవకతవకలపై దర్యాప్తు చేసిన సుప్రీంకోర్టు కమిటీ సానుకూలంగా నివేదిక ఇవ్వడంతో కంపెనీ షేర్లలో ఒక్కసారిగా పుంజుకున్నాయి. దాని ఫలితంగానే ఎల్ఐసీ పెట్టుబడుల విలువ మళ్లీ పెరుగుతోంది.

Also Read..

ఈ ఏడాది 40 శాతం తగ్గనున్న క్యాంపస్ నియామకాలు!

Advertisement

Next Story

Most Viewed