Credit Score చెక్ చేస్తున్నారా.. 750 కంటే తక్కువగా ఉంటే పరిస్థితేంటి?

by GSrikanth |   ( Updated:2023-02-04 08:40:35.0  )
Credit Score చెక్ చేస్తున్నారా.. 750 కంటే తక్కువగా ఉంటే పరిస్థితేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్ అనంతరం మానవ జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ప్రజలు డిజిటల్ చెల్లింపులకు ఎక్కువగా మొగ్గుచూపడం ప్రారంభించారు. అంతేగాక, క్రెడిట్ కార్డుల వాడకం సైతం భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కొత్త తలనొప్పులు పెరిగిపోయాయి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేక, క్రికెట్ స్కోరు కాపాడుకోక నానా తిప్పలు పడుతున్నారు.

క్రెడిట్ స్కోరు 750కి మించి ఉన్నప్పుడే ఎంతో కొంత రాయితీ ప్రయోజనం ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత వరుసగా మూడు నెలల పాటు వాయిదాలు చెల్లించకపోతే క్రిడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే రుణ వాయిదాలు, క్రిడిట్ కార్డు బిల్లులు గడువులోపే చెల్లించడం ఉత్తమం. ఒక్కసారి ఆలస్యంగా చెల్లించినా.. క్రెడిట్ స్కోరు 100 పాయింట్లకు పైగా ప్రభావితం అవుతుంది. మంచి క్రికెట్ స్కోరు దక్కాలంటే చెల్లింపులన్నీ గడువు నాటికి ముందే చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే క్రెడిట్ కార్డులకు కనీస మొత్తమైనా గడువులోపు చెల్లించాలి. ముఖ్యంగా రుణం తీసుకున్న వారు నెలకోసారైనా క్రెడిట్ స్కోరు చెక్ చేసుకొని జాగ్రత్త పడాలి. అప్పుడే మీ క్రెడిట్ స్కోరు తిరిగి 750 పాయింట్ల కన్నా అధికంగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి : బ్యాంకింగ్ రంగంపై నిరంతరం పర్యవేక్షణ: ఆర్‌బీఐ

Advertisement

Next Story

Most Viewed