Madhabi Puri Bach: సెబీ చీఫ్ మాధబీ పురీకి సమన్లు జారీ చేసిన పార్లమెంటరీ క‌మిటీ

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-05 14:06:24.0  )
Madhabi Puri Bach: సెబీ చీఫ్ మాధబీ పురీకి సమన్లు జారీ చేసిన పార్లమెంటరీ క‌మిటీ
X

దిశ, వెబ్‌డెస్క్:సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఛైర్మన్ మాధబీ పురీ బచ్(Madhabi Puri Bach)కు పార్లమెంటరీ క‌మిటీ(PAC) సమన్లు(Summons) జారీ చేసింది.ఈ నెల 24న క‌మిటీ ముందు హాజరవ్వాలని ఆదేశించింది.కాగా గౌతమ్ అదానీ(Gautham Adani)కి చెందిన మారిషస్‌ కంపెనీల్లో(Mauritius Companys) మాధబీ పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని అమెరికా(USA)కు చెందిన షార్ట్‌సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌(Hindenburg) కొన్ని నెలల క్రితం ఆరోపించింది.ఈ నేపథ్యంలో దేశంలోని టాప్ రెగ్యులేటరీ అథారిటీల(Regulatory Authorities) పనితీరును సమీక్షించాలని పీఏసీ నిర్ణయించింది.మాధబీతో పాటు ట్రాయ్ ఛైర్మ‌న్(TRAI Chairman) అనిల్ కుమార్ లాహోటి(Anil Kumar Lahoti)ల‌కు కూడా పీఏసీ స‌మ‌న్లు జారీ చేసింది.అయితే ఈ సమావేశానికి మాధబీ పురీ, లాహోటిలు వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. వారి తరఫున సీనియ‌ర్ అధికారులు ఈ మీటింగ్ (Meeting)కు ప్రాతినిధ్యం వహిస్తారని క‌మిటీ పేర్కొంది.ఆర్థిక అవకతవకలపై మాధబీ చుట్టూ వివాదాలు అలముకున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంత‌రించుకుంది.కాగా 2022లో సెబీ ఛైర్ పర్సన్(SEBI Chairperson)గా మాధబీ పురీ బచ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story