- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LIC Jeevan Shiromani Plan : కోటి రూపాయల పాలసీ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రస్తుతం పాలసీల పట్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రజలు అనవసర ఖర్చులు తగ్గించుకుని వాటిని పాలసీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ మొత్తంలో పాలసీలో పెట్టుబడి పెట్టి తర్వాత ఎక్కువ రాబడి పొందాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. కరోనా తర్వాత చాలా రకాల పాలసీలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే భారత ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఎక్కువ రాబడి ఇచ్చే పాలసీలను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ మధ్య ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకొచ్చింది, దాని పేరు ‘జీవన్ శిరోమణి ప్లాన్’.
ఈ పాలసీ ద్వారా వినియోగదారులు భారీ మొత్తంలో కోటి రూపాయలు వరకు రాబడి సంపాదించవచ్చు. ఇది నాలుగు కాల పరిమితులను కలిగి ఉంటుంది. పాలసీదారుల గరిష్ట వయస్సు 55 ఏళ్లు, కనీస వయస్సు 18 ఏళ్లుగా ఉంది. 14,16,18,20 సంవత్సరాల ప్రాతిపదికన హమీ మొత్తం ఒక కోటి రూపాయలుగా ఉంది. ఈ ప్లాన్ 15 రకాల అనారోగ్య సమస్యలకు ప్రయోజనాలు అందిస్తుంది.
పాలసీ తీసుకున్న తర్వాత మెచ్యూరిటీకి ముందే పాలసీదారు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం అందుతుంది. 55 సంవత్సరాలు గల వారికి పాలసీ వ్యవధి 14 సంవత్సరాలుగా, 51 సంవత్సరాలు గల వారికి పాలసీ వ్యవధి 16 సంవత్సరాలుగా, 48 సంవత్సరాలు గల వారికి పాలసీ వ్యవధి 18 సంవత్సరాలుగా, 45 సంవత్సరాలు గల వారికి పాలసీ వ్యవధి 20 సంవత్సరాలుగా ఉంటుంది.
‘జీవన్ శిరోమణి’ పాలసీలో ఎంచుకున్న ప్రీమియం ఆధారంగా రాబడి ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 20 ఏళ్ల టర్మ్‌తో కోటి రూపాయల రాబడి కావాలనుకుంటే 16 ఏళ్ల పాటు ఏడాదికి రూ.6,93,350 + జీఎస్‌టీ చొప్పున ప్రీమియం చెల్లించాలి. ప్రాథమిక హామీ మొత్తం రూ. 1,00,00,000. వినియోగదారులకు అనారోగ్య పరిస్థితుల కాలంలో ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుంది. అధిక మొత్తంలో లాభం అందించే ఈ పాలసీ గురించి తెలుసుకోవడానికి దగ్గరలోని LIC బ్రాంచ్ లో సంప్రదించగలరు.