కిలో ఆలుగడ్డ రూ. 50,000

by Harish |   ( Updated:2023-04-13 13:31:48.0  )
కిలో ఆలుగడ్డ రూ. 50,000
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాదుంపలు(ఆలుగడ్డ) ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార పంటగా ప్రసిద్ధి చెందింది. మాములుగా భారత్‌లో దీని ధర కిలో రూ. 30 నుంచి మొదలుకుని రూ.100 వరకు ఉంటుంది. అయితే కిలోకు వేల రూపాయలకు పైగా ఉండటం ఎక్కడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. కేజీ బంగాళాదుంప ధర రూ. 40,000 నుంచి రూ. 50,000 పలుకుతుంది. అది ఎక్కడ అంటే ఫ్రాన్స్‌లోని ఒక ద్వీపంలో.


దీనికి ఉన్న ప్రత్యేకత కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపగా నిలిచింది. దీని పేరు ‘Le Bonnotte(లే బోనోట్)’. ఫ్రాన్స్‌లోని Ile De Noirmoutier ద్వీపంలో ప్రత్యేకంగా సాగు చేస్తారు. ఇది ఏడాదిలో 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సముద్రపు పాచి, ఆల్గేను సహజ ఎరువులుగా ఉపయోగించి కేవలం 50 చదరపు మీటర్ల ఇసుక భూమిలో దీన్ని సాగు చేస్తారు.


రుచి పరంగా సాధారణ ఆలుగడ్డలతో పోలిస్తే దీని రుచి కొంచెం ఉప్పగా, పుల్లగా ఉంటుంది. కూరగా కాకుండా సలాడ్లు, సూప్‌లను తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. దీనిలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించే పలు ప్రోటీన్స్ ఉన్నాయి. మనుషులకు వచ్చే చాలా రోగాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. కోత సమయంలో ఎలాంటి పనిముట్లు వాడకుండా మనుఫులనే కోతకు వాడతారు.


Also Read...

ఏప్రిల్-13: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement

Next Story

Most Viewed