JIO: జియోకు కస్టమర్లు భారీ షాక్.. కోటి మంది గుడ్ బై..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-21 10:37:01.0  )
JIO: జియోకు కస్టమర్లు భారీ షాక్.. కోటి మంది గుడ్ బై..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టెలికాం దిగ్గజం జియో(JIO)కు కస్టమర్లు ఊహించని షాకిచ్చారు. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికం(July-September Quarter)లో జియో యూజర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏకంగా 1.07 కోట్ల మంది జియోకు గుడ్ బై చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో మొదటి సారిగా ఆ సంస్థ కోటి మందికి పైగా సబ్ స్క్రైబర్స్(Subscribers)ను కోల్పోయింది. కాగా జియో దేశంలో 4G నెట్ వర్క్(4G Network)ను ప్రారంభించిన నాటి నుంచి ప్రతి త్రైమాసికంలో వినియోగదారులు పెరుగుతూ రావడమే కానీ పోగొట్టుకున్న దాఖలాలు లేవు.

కాగా జూలైలో జియో తన రీఛార్జ్ ప్లాన్(Recharge plan)ల రేట్లు 12 నుంచి 25 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. అందువల్లే చాలా మంది బడ్జెట్ యూజర్లు జియోను వదిలి ఇతర నెట్ వర్క్(Other Network)లకు వెళ్లిపోయారని తెలుస్తోంది. అయితే 5జీ యూజర్ బేస్(5G User Base) మాత్రం 130 మిలియన్ల నుంచి 147 మిలియన్లకు చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. రీఛార్జ్ రేట్స్ పెరగక ముందు ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం రూ. 181.7 ఉండగా ఇప్పుడు అది రూ. 195.1 కి పెరిగిందని తెలిపింది . అంతేకాదు, పెరిగిన లాభాలతో 6,536 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది. కస్టమర్లను కోల్పోవడం తమ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed