2030 నాటికి ఎనిమిది ఈవీలను విడుదల చేయనున్న జేఎల్ఆర్!

by Vinod kumar |
2030 నాటికి ఎనిమిది ఈవీలను విడుదల చేయనున్న జేఎల్ఆర్!
X

ముంబై: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) దేశీయ మార్కెట్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. 2030 నాటికి కంపెనీ ఏకంగా 8 ఈవీలను తీసుకురానున్నట్టు ఆదివారం ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి జేఎల్ఆర్ నుంచి జాగ్వార్ ఐ-పేస్ ఈవీ మోడల్ మాత్రమే మార్కెట్లో ఉంది. రేంజ్ రోవర్ ఈవీ కోసం 2024 నుంచి ఆర్డర్లు తీసుకుంటామని, 2025 నాటికి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ సీఓఓ లెనార్డ్ హుర్నిక్ అన్నారు. భారత్‌ను ప్రధాన మార్కెట్‌గా భావిస్తున్నాం.

దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను పరిశీలిస్తున్నాం. అందుకు అనుగుణంగానే కంపెనీ ముందుగా ఆఫర్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాం. ఈవీల తయారీలో బ్యాటరీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మకాలు ఒక దశకు చేరుకునే వరకు ఈవీ ధరలు ఎక్కువగానే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed