- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటెల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు, సెమీకండక్టర్ చిప్ దిగ్గజం గోర్డాన్ మూర్ కన్నుమూత
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటెల్ కార్పొరేషన్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ అయిన గోర్డాన్ మూర్ 94 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు కంపెనీ ప్రకటించింది. శుక్రవారం హవాయిలోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో తుదిశ్వాస విడిచినట్లు గోర్డాన్, బెట్టీ మూర్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ చిప్‌ల రూపకల్పన, తయారీలో ముఖ్యమైన పాత్ర పోషించిన మూర్, సిలికాన్ వ్యాలీ మార్గదర్శకుడిగా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు..
మూర్, అతని సహచరులు రాబర్ట్ నోయిస్, ఆండ్రూ గ్రోవ్‌తో కలిసి జులై 1968లో ఇంటెల్‌ను స్థాపించారు. తర్వాత కాలంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ల తయారీ సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే 80 శాతం కంప్యూటర్లకు ఈ సంస్థే మైక్రోప్రాసెసర్‌లను సరఫరా చేస్తుంది. మూర్ 1975 వరకు ఇంటెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా,1979లో బోర్డ్ ఛైర్మన్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, 1997 వరకు చైర్మన్‌గా ఉన్నాడు.
2023లో ఫోర్బ్స్ మ్యాగజైన్ మూర్ నికర సంపదను 7.2 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. 2000 సంవత్సరంలో తన భార్యతో కలిసి, గోర్డాన్, బెట్టీ మూర్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. మూర్ 2002లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ W.బుష్ నుండి ఆ దేశ అత్యున్నత పురస్కారం మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను అందుకున్నాడు.
మూర్ 1965లో రాసిన ఒక వ్యాసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. ముఖ్యంగా రానున్న కాలంలో టెక్నాలజీ పెరుగుదలలో భాగంగా మైక్రోచిప్‌లపై ట్రాన్సిస్టర్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుందని, కంప్యూటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం రెట్టింపు అవుతుందంటూ ఆయన చెప్పిన సిద్ధాంతం ‘‘మూర్స్ లా’’గా పేరుగాంచింది. అలాగే, చిప్‌ల కారణంగా ఆటోమొబైల్, కంప్యూటర్‌లు, కమ్యూనికేషన్‌తో సహా వివిధ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని అప్పుడే మూర్ తన వ్యాసంలో పేర్కొన్నాడు.