- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంచనాలను అందుకోలేకపోయిన ఇన్ఫోసిస్!
ముంబై: దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాల్లో అంచానాలను అందుకోలేకపోయింది. అమెరికాలో బ్యాంకింగ్ రంగం సంక్షోభం కారణంగా క్లయింట్లు ఐటీ ఖర్చులను తగ్గించడమే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ. 6,128 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 7.8 శాతం వృద్ధి. అలాగే, మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 37,441 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 32,276 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే 16 శాతం వృద్ధి సాధించింది. ఇక, ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ రూ. 17.50 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీని ఈ ఏడాది జూన్ 2గా నిర్ణయించగా, జూలై 3న డివిడెండ్ చెల్లించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇక, కంపెనీ అట్రిషన్ రేటు 20.9 శాతంగా ఉంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గురువారం కంపెనీ షేర్ ధర దాదాపు 3 శాతం క్షీణించి రూ. 1,388.60 వద్ద ముగిసింది.