ప్రథమార్థంలో 5 శాతం పెరిగిన ఉక్కు ఉత్పత్తి!

by Vinod kumar |
ప్రథమార్థంలో 5 శాతం పెరిగిన ఉక్కు ఉత్పత్తి!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యకాలంలో దేశీయంగా ఉక్కు ఉత్పత్తి మెరుగ్గా నమోదైంది. వినియోగ సామర్థ్యం పెరగడం, కీలకమైన దేశీయ స్టీల్ కంపెనీలు సామర్థ్యాన్ని పెంచడం వంటి పరిణామాలతో దేశీయంగా ఉత్పతీ ఊపందుకుంది. స్టీల్‌మింట్ ప్రకారం, సమీక్షించిన కాలంతో 6.61 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరిగింది. ఇది గతేడాది కంటే 5 శాతం ఎక్కువ. 2022, ప్రథమార్థంలో 6.3 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి నమోదైంది. ప్రస్తుత సానుకూల పరిణామాల మధ్య ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉంది. దేశీయంగా వినియోగం కూడా గతేడాది కంటే 11 శాతం పెరిగింది.

2022లో దేశీయ అవసరాలకు 5.3 కోట్ల టన్నుల ఉక్కు వినియోగం జరగ్గా, 2023, మొదటి అర్ద భాగంలో 5.8 కోట్ల టన్నుల ఉక్కు వినియోగం జరిగింది. సమీక్షించిన కాలంలో ఉక్కు ఎగుమతులు మాత్రం 30 శాతం తిన్నాయి. చైనా ఎగుమతులు భారీగా పెంచడమే దీనికి కారణం. 2022, ప్రథమార్థంలో 67 లక్షల టన్నుల ఉక్కును ఎగుమతి చేయగా, ఈ ఏడాది అదే సమయంలో 47.4 లక్షల టన్నుల ఉక్కు ఎగుమతులు నమోదయ్యాయి. చైనా నుంచి చౌకగా ఉక్కు లభించడం, సాంప్రదాయ దిగుమతి మార్కెట్లలో డిమాండ్ నెమ్మదించడం వల్లనే మన దేశం నుంచి ఉక్కు ఎగుమతులు తగ్గాయని స్టీల్‌మింట్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed