2030 నాటికి రూ. 584 లక్షల కోట్లు దాటనున్న భారత రిటైల్ డిజిటల్ చెల్లింపులు

by S Gopi |
2030 నాటికి రూ. 584 లక్షల కోట్లు దాటనున్న భారత రిటైల్ డిజిటల్ చెల్లింపులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు అత్యంత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిటైల్ డిజిటల్ చెల్లింపు 2030 నాటికి ప్రస్తుతం కంటే రెట్టింపు స్థాయిలో 7 ట్రిలియన్ డాలర్ల(రూ. 584.6 లక్షల కోట్ల)కు చేరుకునే అవకాశం ఉందని కెయిర్నె, అమెజాన్ పే సంయుక్త అధ్యయనం పేర్కొంది. 'హౌ అర్బన్ ఇండియా పేస్' పేరుతో విడుదల చేసిన నివేదికలో డిజిటల్ చెల్లింపుల అవకాశాలు వినియోగదారుల కొనుగోళ్ల ధోరణిలో సమగ్ర మార్పులకు ఎలా దారి తీశాయనే అంశాలను పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల పెరుగుదల కారణంగా ఈ-కామర్స్ రంగం 2022లో రూ. 6.3 లక్షల కోట్ల నుంచి 2030 నాటికి రూ. 6.7 లక్షల కోట్లకు చేరనుంది. డిజిటల్ చెల్లింపుల మద్దతుతో ఈ రంగం ఏటా 21 శాతం పెరుగుతుందని అంచనా. గడిచిన ఐదేళ్లలోనూ రిటైల్ డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పుంజుకున్నాయి. 2017-18లో రూ. 25 లక్షల కోట్ల నుంచి 2023-24లో రూ. 300 లక్షల కోట్లకు పెరగడం గమనార్హం. 2030 నాటికి ఇది రూ. 584 లక్షల కోట్లను దాటనుందని నివేదిక అంచనా వేస్తోంది. దీనికి యూపీఐ వ్యవస్థ కీలక మద్దతుగా ఉండనుంది. ముఖ్యంగా కార్డులు, డిజిటల్ వ్యాలెట్ సహా ఇతర సాధనాలు ఎక్కువ వినియోగంలోకి రానున్నాయి. ప్రస్తుతం ఇవి డిజిటల్ లావాదేవీల్లో 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు చిన్న పట్టణాలకు కూడా విస్తరించాయి. ఈ పట్టణాల్లోని ప్రజలు తమ రోజువారీ లావాదేవీల్లో 65 శాతం డిజిటల్‌గానే జరుగుతున్నాయని చెబుతున్నారు. పెద్ద నగరాల్లో ఇది 75 శాతం వరకు ఉంది.

Advertisement

Next Story