అంచనాలకు మించిన నమోదైన భారత జీడీపీ వృద్ధి!

by Harish |   ( Updated:2023-05-31 14:53:51.0  )
అంచనాలకు మించిన నమోదైన భారత జీడీపీ వృద్ధి!
X

న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలకు మించి నమోదైంది. చివరి త్రైమాసికంలో దేశ వృద్ధి 6.1 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అలాగే, 2022-23 మొత్తం ఆర్థిక సంవత్సరానికి వార్షిక వృద్ధి రేటు 7.2 శాతంగా ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 4.5 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. అంతకుముందు 2021-22 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చిలో దేశ జీడీపీ 4 శాతం వృద్ధి చెందింది.

బుధవారం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం, చివరి త్రైమాసికంలో ఉత్పాదక కార్యకలాపాలు ఊపందుకోవడంతో మెరుగైన వృద్ధికి దోహదపడింది. ఆహార, ముడి చమురు, ముడిసరుకుల ధరలు పతనం కావడం, విమాన ప్రయాణం వంటి సేవలు, కార్లు, మొబైల్‌ఫోన్ వంటి తయారీ వస్తువులకు డిమాండ్ పెరుగుదల లాంటి అంశాలు వృద్ధి పెరిగేందుకు దోహదపడ్డాయని గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed