2030 నాటికి మూడో ర్యాంకు సాధించనున్న భారత ఆటోమోటివ్ పరిశ్రమ!

by Vinod kumar |
2030 నాటికి మూడో ర్యాంకు సాధించనున్న భారత ఆటోమోటివ్ పరిశ్రమ!
X

న్యూఢిల్లీ: భారత ఆటోమోటివ్ పరిశ్రమ 2030 నాటికి ప్రపంచంలోనే మూడో ర్యాంకును పొందేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్‌ల కోసం రూ. 25,938 కోట్ల పీఎల్ఐ సహా వివిధ పథకాల మద్దతు ద్వారా పరిశ్రమ ఈ వృద్ధిని సాధించనుందని వెల్లడించింది. మంగళవారం పీఎల్ఐ స్కీమ్ పనితీరును సమీక్షించేందుకు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సదస్సును నిర్వహించనుంది. భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటనలో పీఎల్ఐ వంటి పథకాలు మొత్తం ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి మద్దతు ఇవ్వనుంది. 2030 నాటికి ఇది ప్రపంచంలోనే మూడో ర్యాంకును పొందే అవకాశం ఉందని అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత ఆర్థికవ్యవస్థ వృద్ధికి కీలకమైన వాటిలో ఆటోమోటివ్ పరిశ్రమ ఒకటి. 1992-93లో దేశ జీడీపీకి 2.77 శాతం వరకు మద్దతిచ్చిన పరిశ్రమ ఇప్పుడు 7.1 శాతానికి పెరిగింది. అంతేకాకుండా ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed