SEBI: చైనా కంటే భారత మార్కెట్ల నుంచే ఎక్కువ రాబడి

by S Gopi |
SEBI: చైనా కంటే భారత మార్కెట్ల నుంచే ఎక్కువ రాబడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొద్దిరోజుల నుంచి భారత స్టాక్ మార్కెట్లు బలహీనంగా ర్యాలీ అవుతున్నాయి. ఇదే సమయంలో చైనా తీసుకున్న ఉద్దీపన చర్యలతో అక్కడి మార్కెట్లు దూసుకెళ్లాయి. ఈ అంశం పెట్టుబడిదారుల్లో చర్చనీయాంశం అయిన నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ మెంబర్ అనంత్ నారాయణ్ స్పందించారు. సోమవారం ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ అవెర్‌నెస్ వీక్ కార్యక్రమమ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భారత ఈక్విటీ మార్కెట్లు గత ఐదేళ్లలో స్థిరంగా 15 శాతం రాబడిని అందించాయని, ఇదే సమయంలో చైనా సున్నా లేదా నష్టాలను చూశాయని చెప్పారు. తక్కువ రిస్క్‌తో అధిక రాబడిని భారత మార్కెట్లు అందించాయని, అయితే పెట్టుబడిదారులు జాగ్రత్తలు తీసుకుని, నష్టాలు ఉంటాయనే స్పృహతో ఉండాలని సూచించారు. గత కొన్ని రోజుల నుంచి చైనా మార్కెట్ల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ, గత ఐదేళ్ల వృద్ధిని గమనించాలన్నారు. గతేడాది భారత మార్కెట్లకు అద్భుతమైన ఏడాది అని, సూచీలు 28 శాతం రాబడిని పొందాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed