- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Indian Economy: 2025లో భారత వృద్ధి 6.8 శాతం: డెలాయిట్
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ 6.5-6.8 శాతం వృద్ధి చెందుతుందని డెలాయిట్ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, అధిక వినియోగం ద్వారా వచ్చే 2025-26లోనూ 6.7-7.3 శాతం మధ్య పుంజుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో వృద్ధి అనుకున్న దానికంటే నెమ్మదించింది. ఎన్నికలు, అధిక వర్షపాతం, భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల డిమాండ్, ఎగుమతులపై ప్రభావం కనిపించింది. అయినప్పటికీ వినియోగం పెరగడం, సేవల వృద్ధి, అధిక విలువైన తయారీ ఎగుమతులు ఎక్కువగా ఉండటంతో ద్వితీయార్థం నుంచి వృద్ధి రికవరీ కనిపిస్తోందని డెలాయిట్ ఇండియా ఎకనామిస్ట్ రుమ్కీ మజుందార్ ఆదివారం ప్రకటనలో వివరించారు. ప్రభుత్వం సైతం మౌలిక అభివృద్ధి, డిజిటలైజేషన్, ఎఫ్‌డీఐల ఆకర్షణపై దృష్టి సారించడం వల్ల వృద్ధికి ఊతం లభిస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, కెమికల్స్ వంటి కీలక తయారీ ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. 2025లోనూ ఈ ధోరణి కొనసాగుతుందని డెలాయిట్ అంచనా వేసింది. దేశీయంగా గ్రామీణ, పట్టణ డిమాండ్ కీలకంగా ఆర్థిక వృద్ధికి దోహదపడనున్నాయని పేర్కొంది.