- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రెట్టింపు పెరిగిన స్మార్ట్ ఉత్పత్తుల అమ్మకాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వినియోగదారుల కొనుగోలు ధోరణిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పెరిగిన టెక్నాలజీ వినియోగం ద్వారా చాలామంది స్మార్ట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రముఖ మార్కెట్ పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్ వెల్లడించింది. కంపెనీ తాజా డేటా ప్రకారం, కరోనా వల్ల పెరిగిన ప్రీమియమైజేషన్ కారణంగా మొత్తం మొబైల్‌ఫోన్ విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్‌ల వాటా 2019లో 59 శాతం నుంచి 2022లో 72 శాతానికి పెరిగింది. అదే సమయంలో స్మార్ట్ టీవీల వాటా 52 శాతం నుంచి 90 శాతానికి పెరిగింది.
స్మార్ట్ ఏసీ, స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ వాషింగ్ మెషీన్‌ల వాడకం చాలా వేగంగా పెరుగుతోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా నియంత్రించబడే ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. కరోనాకు ముందు నాటితో పోలిస్తే ప్రస్తుతం స్మార్ట్ ఉత్పత్తుల వాాటా మొత్తం అమ్మకాల్లో రెట్టింపు అయిందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతేకాకుండా కరోనాకు ముందు స్మార్ట్ ఉత్పత్తులకు, సాధారణ ఉత్పత్తుల మధ్య ధరల వ్యత్యాసం గతంలో రూ. 3,000-4,000 మధ్య ఉండగా, ఇప్పుడు రూ. 500-1000 కి తగ్గింది. ఇది కూడా స్మార్ట్ ఉత్పత్తుల వినియోగం పెరిగేందుకు దోహదపడుతోందని హైయర్ ఇండియా అధ్యక్షుడు సతీష్ ఎన్ఎస్ అన్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ లభ్యత, 5జీ సేవలు అందుబాటులోకి రావడం వంటివి కూడా స్మార్ట్ ఉత్పత్తులు పెరిగేందుకు కారణమని కౌంటర్‌పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ శిల్పి జైన్ పేర్కొన్నారు.