2025 చివరి నాటికి యూరియా దిగుమతులకు ఎండ్ కార్డ్: కేంద్ర మంత్రి

by Harish |
2025 చివరి నాటికి యూరియా దిగుమతులకు ఎండ్ కార్డ్: కేంద్ర మంత్రి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా యూరియా తయారీ పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల సరఫరా, డిమాండ్ మధ్య అంతరం తగ్గుతుండటంతో 2025 చివరి నాటికి యూరియా దిగుమతిని భారత్ నిలిపివేస్తుందని రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. భారత వ్యవసాయానికి ఎరువుల లభ్యత చాలా ముఖ్యమైనది. దేశంలో పంటల ఉత్పత్తిని పెంచేందుకు గత 60-65 ఏళ్లుగా రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ప్రస్తుతం నానో లిక్విడ్ యూరియా, నానో లిక్విడ్ డి-అమోనియం ఫాస్ఫేట్ (డిఎపి) వంటి ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు.

నేల ఆరోగ్యానికి ఉపయోగపడే ఎరువులను అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. భారత్ తన అవసరాల్లో ఎక్కువ భాగం ఇతర దేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటుంది. అయితే దీనిని తగ్గించి యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అవలంబించిందని అన్నారు. దేశీయంగా డిమాండ్‌ను తీర్చడానికి భారత్‌కు ఏటా 350 లక్షల టన్నుల యూరియా అవసరమని ఆయన తెలిపారు.

మూతపడిన నాలుగు యూరియా ప్లాంట్లను ఇప్పటికే తిరిగి పునరుద్ధరించగా, మరోకటి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. 2014-15లో 225 లక్షల టన్నులుగా ఉన్న దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను 310 లక్షల టన్నులకు పెంచగా, ఐదో ప్లాంట్ ప్రారంభం అయితే సామర్థ్యం దాదాపు 325 లక్షల టన్నులకు చేరుకుంటుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, యూరియా దిగుమతులు అంతకు ముందు ఏడాది 91.36 లక్షల టన్నుల నుంచి 2022-23లో 75.8 లక్షల టన్నులకు తగ్గాయి.

Advertisement

Next Story

Most Viewed