US : జూన్‌‌లో గరిష్ట స్థాయిలో అమెరికా సెక్యూరిటీ హోల్డింగ్‌లను కలిగి ఉన్న భారత్

by Harish |   ( Updated:2024-08-20 08:45:46.0  )
US : జూన్‌‌లో గరిష్ట స్థాయిలో అమెరికా సెక్యూరిటీ హోల్డింగ్‌లను కలిగి ఉన్న భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జూన్ నెలలో భారత్ గరిష్టంగా $241.9 బిలియన్ల అమెరికా సెక్యూరిటీ హోల్డింగ్‌లను కలిగి ఉందని తాజాగా విడుదలైన నివేదిక వెల్లడించింది. ఇది గత ఏడాది జాన్ నెలలో 235.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం, అత్యధికంగా జపాన్ దేశం $1.11 ట్రిలియన్లకు పైగా విలువైన అమెరికా సెక్యూరిటీ హోల్డింగ్‌లను కలిగి ఉంది. తరువాత $780.2 బిలియన్లతో రెండో స్థానంలో చైనా, $741.5 బిలియన్లతో మూడో స్థానంలో యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి.

ఈ జాబితాలో ఇండియా $241.9 బిలియన్లతో 12వ స్థానంలో ఉంది. ఇది మేలో నమోదైన $237.8 బిలియన్ల విలువ కంటే ఎక్కువ. మార్చి నెలలో $240.6 బిలియన్ల నుండి ఏప్రిల్‌లో $233.5 బిలియన్లకు క్షీణించింది. జాబితాలో కెనడా $374.8 బిలియన్లతో ఐదవ స్థానంలో ఉంది. అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇతర సవాళ్ల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కనిపిస్తుందని నివేదిక పేర్కొంది. జూన్ త్రైమాసికంలో, యునైటెడ్ స్టేట్స్‌లో వాస్తవ GDP వార్షిక రేటు 2.8 శాతంతో విస్తరించింది, ఇది 2024 మొదటి మూడు నెలల్లో చూసిన 1.4 శాతం కంటే ఎక్కువగా ఉంది. జులైలో విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ అప్‌డేట్‌లో, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్టికీ స్పాట్‌లో ఉందని, ఈ సంవత్సరానికి 3.2 శాతం వృద్ధిని అంచనా వేసింది.

Advertisement

Next Story