- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమే కాదు, పేద దేశం కూడా: రఘురామ్ రాజన్
దిశ, బిజినెస్ బ్యూరో: జీ20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉందని, ఇదే సమయంలో అత్యంత పేద దేశంగా కూడా ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ నిర్వహించిన 'ఆన్ జీపీఎస్:ఇండియాస్ ఎంప్లాయిమెంట్ క్రైసిస్ ' అంశంపై నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిరుద్యోగం రేటు 8.1 శాతం ఉందని సీఎంఐఈ నివేదికను ఆయన హైలైట్ చేశారు. దేశంలో శ్రామిక జనాభాలోని కేవలం 37.6 శాతం మంది మాత్రమే కలిగి ఉండటంపై స్పందించిన ఆయన.. జీ20లో వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ పేద దేశంగా కూడా ఉందన్నారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో యువత శ్రామికశక్తిగా మారుతుండటం భారత్‌కు కలిసొస్తుంది. వారికి ఉపాధి అందించగలిగితే, భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి మెరుగ్గా 6.5 శాతంగా ఉంది. ఇదే సమయంలో దేశీయంగా అధిక జానాభా ఉంది. అందుకే మిగిలిన దేశాల కంటే వేగంగా ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉందని రాజన్ పేర్కొన్నారు. త్వరలో భారత్ జపాన్, జర్మనీలను దాటి మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా రోడ్లు, రైల్వేలను నిర్మిస్తోందని, అయినప్పటికీ దేశీయంగా కొత్త ఆవిష్కరణలు, చర్చలకు అనువైన స్వేచ్చా వాతావరణ అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.