India Growth: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7 శాతం: ఐఎంఎఫ్

by S Gopi |
India Growth: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7 శాతం: ఐఎంఎఫ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాలను 7 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) ప్రకటించింది. కరోనా కారణంగా ఏర్పడిన డిమాండ్ తగ్గిందని, ఆర్థికవ్యవస్థ తిరిగి కొవిడ్‌కు మునుపటి సామర్థ్యాన్ని పొందడంతో జూలైలో అంచనా వేసిన వృద్ధినే కొనసాగిస్తున్నట్టు ఐఎంఎఫ్ పేర్కొంది. అలాగే, 2025 నాటికి 6.5 శాతానికి పరిమితమవుతుందని వరల్డ్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదిక అభిప్రాయపడింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య సరుకుల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణంపై ప్రభావం కనిపిస్తోంది. దీనివల్ల వృద్ధి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయని, సెంట్రల్ బ్యాంకులు మానిటరీ పాలసీలో రేట్ల పెంపునకు దూరంగా ఉండొచ్చని ఐఎంఎం వివరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ద్రవ్యోల్బణం 4.4 శాతం ఉండవచ్చని, ఆ తర్వాత ఆర్థిక 2025-25లో 4.1 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. వృద్ధి అవకాశాలను పెంచేందుకు నిర్మాణాతమక సంస్కరణలు అవసరమని ఐఎంఎఫ్ సూచించింది.

Advertisement

Next Story

Most Viewed