- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hyundai i20 N Line Highlights : కొత్తగా i20 కారు.. ధర రూ.9.99 లక్షలు
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం హ్యూండాయ్ మోటార్స్ ఇండియా తన కొత్త ఐ20 ఎన్-లైన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధరను రూ. 9.99 లక్షల నుంచి రూ. 12.32 లక్షల మధ్య నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల భద్రతను పరిగణలోకి తీసుకుని అందుకవసరమైన కొత్త ఫీచర్లు, డిజైన్, ఇతర సాంకేతిక ఫీచర్లలో మార్పులు చేసినట్లు హ్యూండాయ్ వెల్లడించింది.
సరికొత్త ఐ20 ఎన్-లైన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌తో వస్తుంది. దీనికి మూడేళ్లు లేదంటే 1.50 లక్షల కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారులో డిజైన్ మాత్రమే కాకుండా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ వేరియంట్లో కొత్త తరానికి ఇష్టమైన రీతిలో మార్పులు చేసినట్లు కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ అన్నారు. భద్రతకు సంబంధించి 6-ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 60 రకాల కనెక్టెడ్ ఫీచర్లు ఈ కారులో అందించామని కంపెనీ పేర్కొంది.