- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్-విజయవాడ హైవే రోడ్ పరిధిలో రియల్ ఎస్టేట్‌కు మంచి భవిష్యత్: G Square
దిశ, వెబ్‌డెస్క్: జీ స్క్వేర్ హౌసింగ్ సంస్థ ఎకనమిక్ టైమ్స్ సహకారంతో 'విజయవాడ హైవే రోడ్ టు ద ఫ్యూచర్ (విజయవాడ హైవే రోడ్ నుంచి భవిష్యత్ దిశగా)' శీర్షికన ఓ సదస్సును హైదరాబాద్‌లోని జెడబ్ల్యు మారియట్ హోటల్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమంలో పరిశ్రమకు చెందిన పలువురు సుప్రసిద్ధ వక్తలు సైతం పాల్గొన్నారు.
ఎకనమిక్ టైమ్స్ సీనియర్ ఎడిటర్ అశుతోష్ సిన్హా ఈ చర్చకు మోడరేటర్‌గా వ్యవహరించగా, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ గుమ్మి రామ్ రెడ్డి; సీబీఆర్‌ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ జిప్సన్ పౌల్; బ్లూ కోపా కో–ఫౌండర్, సీఓఓ శ్రీ రాఘవేంద్ర రెడ్డి; జీ స్క్వేర్ హౌసింగ్ సీఈఓ శ్రీ ఈశ్వర్ ఎన్ పాల్గొన్నారు.
విజయవాడ హైవే రోడ్ పట్ల తమ అభిప్రాయాలను సభ్యులు వెల్లడించారు. హైదరాబాద్‌లో త్వరలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కేంద్రంగా మారనుందన్నారు.
ఈ కార్యక్రమంలో జయేష్ రంజన్ మాట్లాడుతూ ''తూర్పు కారిడార్ చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు చేస్తుంది. తెలంగాణలో టైర్2, టైర్3 నగరాలలో సైతం ఐటీ పార్కులను ఏర్పాటు చేయనున్నాము. సూర్యాపేటలో త్వరలోనే 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టెక్ పార్క్ ప్రారంభించనున్నాము. పలు కంపెనీలు తమ కార్యాలయాలను అక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి. అలాగే పోచారంలో చేనేత కార్మికుల సాధికారత దిశగా కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. యాదాద్రి దేవాలయం, ఆ పరిసరాలు కూడా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి'' అని అన్నారు.
జీ స్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ ''ఈ హైవే మార్గం ఉపయోగించుకుని ఎంతోమంది విజయవాడ, వైజాగ్‌లను చేరుకుంటుంటారు. ఈ హైవే మార్గం భావి రియల్ ఎస్టేట్ కేంద్రంగా నిలువనుంది. ఇక్కడ పెట్టుబడి పెడితే త్వరలోనే భారీ ప్రయోజనాలను పొందగలరు'' అని అన్నారు.