రిక్రూటర్‌లకు మొదటి ఎంపికలుగా హైదరాబాద్, నవీ ముంబై, పూణే నగరాలు

by Harish |
రిక్రూటర్‌లకు మొదటి ఎంపికలుగా హైదరాబాద్, నవీ ముంబై, పూణే నగరాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా హైదరాబాద్, నవీ ముంబై, పూణే నగరాల్లో కెరీర్ పరంగా మెరుగైన అవకాశాలు ఉన్నాయని, ఈ నగరాలు డైనమిక్ టాలెంట్ హబ్‌లుగా ఆవిష్కరించబడ్డాయని KPMG నుంచి వచ్చిన టాలెంట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ పేర్కొంది. పెరుగుతున్న డిమాండ్‌లను తీర్చడానికి, క్లిష్టమైన నైపుణ్యంతో కూడిన విభిన్న ప్రతిభను కోరుకునే రిక్రూటర్‌లకు ఈ నగరాలు మొదటి ఎంపికలుగా ఉన్నాయి. నివేదిక ప్రకారం, టైర్ 1 నగరాల్లో తీవ్రమైన పోటీ, అధిక కెరీర్ అవకాశాల కారణంగా డెబ్బై శాతం కంపెనీలు అధిక అట్రిషన్‌ను రేటును ఎదుర్కొంటున్నాయి. నవీ ముంబై, గురుగ్రామ్ వంటి శాటిలైట్ నగరాల్లోని సంస్థలు తమ అభ్యర్థుల టాలెంట్‌ను ఉపయోగించుకుని 90 శాతం ఫలితాలతో చాలా సంతృప్తిగా ఉన్నాయని సర్వే పేర్కొంది.

అభ్యర్థులు ఆహరం, ఎంటర్‌టైన్‌మెంట్, అత్యాధునిక ఆరోగ్యం, ఫిట్‌నెస్ క్లబ్‌లు, సుస్థిరత, అద్భుతమైన రవాణా కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు వంటి సౌకర్యాలను అందించే ఆఫీస్ క్యాంపస్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ సౌకర్యాలను అందించే కంపెనీల్లో పనిచేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారని సర్వేలో తేలింది. మొత్తం జీవన నాణ్యత పరంగా హైదరాబాద్, నవీ ముంబై, పూణే మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరు, గురుగ్రామ్, పూణేలు స్థానిక కొనుగోలు శక్తిని ఎక్కువగా అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

భద్రత పరంగా సురక్షితమైన వాతావరణాన్ని కోరుకునే వారిని ఆకర్షిస్తున్న జాబితాలో చెన్నై, నవీ ముంబై, పూణేలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉండటంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టడానికి కార్యాలయం స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, నవీ ముంబై, చెన్నై వంటి నగరాల్లో ఆఫీస్‌ల ఏర్పాటుకు డిమాండ్ పెరిగినట్లు సర్వేలో తేలింది.

Advertisement

Next Story

Most Viewed