Hurun India: అత్యంత విలువైన వ్యాపార కుటుంబం.. అంబానీలదే అగ్రస్థానం

by S Gopi |
Hurun India: అత్యంత విలువైన వ్యాపార కుటుంబం.. అంబానీలదే అగ్రస్థానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా కుటుంబ వ్యాపారాలను నిర్వహిస్తున్న వారిలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ అగ్రస్థానంలో నిలిచింది. 2024 ఏడాదికి సంబంధించి ప్రముఖ హురున్ ఇండియా విడుదల చేసిన భారత అత్యంత విలువైన వ్యాపార కుటుంబం జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ. 25.75 లక్షల కోట్లతో టాప్-1 స్థానాన్ని సాధించింది. ఈ మొత్తం భారత జీడీపీలో 10 శాతానికి సమానం కావడం గమనార్హం. ఈ జాబితాలో అంబానీ కుటుంబం తర్వాత బజాజ్, బిర్లా కుటుంబాలు ఉన్నాయి. అంబానీ కుటుంబం నికర సంపద రూ. 25,75,100 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా, నీరజ్ బజాజ్ నేతృత్వంలోని బజాజ్ ఫ్యామీలీ రూ. 7,12,700 కోట్లతో, కుమార్ మంగళం బిర్లా కుటుంబాం రూ. 5,38,500 కోట్లు తర్వాతి స్థానాల్లో టాప్-10 జాబితాలో ఉన్నాయి. గౌతమ్ అదానీ కుటుంబం రూ. 15,44,500 కోట్ల సంపద ఉన్నప్పటికీ మొదటితరం ఫ్యామిలీ కావడంతో ఈ జాబితాలో చోటు సంపాదించలేకపోయింది. అయితే, మొదటితరం కుటుంబ వ్యాపారాల జాబితాలో అదనీ ఫ్యామిలీ అగ్రస్థానం సంపాదించుకుంది. రెండో స్థానంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిలిచింది. హురున్ ఇండియా నివేదిక ప్రకారం, టాప్-10 విలువైన వ్యాపార కుటుంబాల్లో బిర్లా ఫ్యామిలీ తర్వాత జిందాల్( జేఎస్‌డబ్ల్యూ స్టీల్,రూ. 4.71 లక్షల కోట్లు), నాడార్(హెచ్‌సీఎల్ టెక్, రూ. 4.30 లక్షల కోట్లు) మహీంద్రా(ఎంఅండ్ఎం, రూ. 3.45 లక్షల కోట్లు), డానీ, చోక్సీ, వకిల్(ఏషియన్ పెయింట్స్, రూ. 2.71 లక్షల కోట్లు), ప్రేమ్ జీ(విప్రో, రూ. 2.57 లక్షల కోట్లు), రాజీవ్ సింగ్(డీఎల్ఎఫ్, రూ. 2.04 లక్షల కోట్లు), మురుగప్ప(ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్, రూ. 2.02 లక్షల కోట్లు) కలిగి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed