- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
iPhone: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా?.. అయితే మీకే ఈ గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: ఐఫోన్ వాడకం ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనుకునే రోజుల నుంచి ఐఫోన్ ఉంటేనే రెస్పెక్ట్ అనే పరిస్థితికి వచ్చింది సమాజం. అందులో భాగంగానే వాడితే ఐఫోనే వాడాలనే కోరిక చాలా మందిలో పుడుతోంది. తాజాగా ఐఫోన్ ప్రియులకు యాపిల్ సంస్థ శుభవార్త చెప్పింది. ఫోన్ ధరలు తగ్గించింది. బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేసింది. దీంతో 15Pro మోడల్ ధర రూ.5100, Pro Max మోడల్ ఫోన్ల ధర రూ.6 వేలు, SE మోడల్ ధర రూ.2300 తగ్గాయి. భారత్‌లో తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలు సైతం తగ్గాయి. ఒక్కో ఫోన్‌పై దాదాపు రూ.300 వరకూ తగ్గాయి. కాగా, బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని 20 నుంచి 15 శాతానికి కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే. కాగా, రూ.48.21 కోట్లతో కేంద్ర బడ్జెట్ 2024 (Union Budget 2024)ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.