Amazon Prime Day 2024 Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కీబోర్డులు, మౌస్‌లు, పీసీలపై భారీ తగ్గింపులు

by Harish |
Amazon Prime Day 2024 Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కీబోర్డులు, మౌస్‌లు, పీసీలపై భారీ తగ్గింపులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 48 గంటల ప్రైమ్ డే సేల్‌లో పలు ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంచింది. జులై 20 నుంచి జులై 21 వరకు జరగనున్న ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో పాటు కొనుగోలు సమయంలో బ్యాంక్ కూపన్‌లు, ఇతర ఆఫర్‌లను పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, ఉపకరణాలు, గృహోపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, PCలు, డెస్క్‌టాప్ స్పీకర్లు, కీబోర్డులు మొదలగు వాటిని తక్కువ ధరలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. సాధారణ రోజుల్లో కంటే ఉత్పత్తులపై ఈ రెండు రోజులు ప్రత్యేక తగ్గింపులు ఉంటాయి.

ముఖ్యంగా పీసీలు లేదా దాని ఇతర ఉత్పత్తులపై అమెజాన్ భారీ డిస్కౌంట్‌లను అందిస్తుంది. మౌస్‌లు, మెకానికల్ కీబోర్డ్‌లు, స్పీకర్లు, వెబ్ కెమెరాలు, USB హబ్‌లు తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. రూ. 4,229 విలువ కలిగిన Asus Marshmellow Kw100 కీబోర్డ్‌ను 47 శాతం తగ్గింపుతో రూ.2,299కే కొనుగోలు చేయవచ్చు. HP Z3700 వైర్‌లెస్ ఆప్టికల్ మౌస్ అసలు ధర రూ.1,499 కాగా ఇది 48 శాతం తగ్గింపుతో ప్రస్తుతం రూ. 899 కే లభిస్తుంది. Lenovo 300 FHD వెబ్‌క్యామ్ అసలు ధర రూ.5,310 కాగా, దీనిని ఈ సేల్‌లో రూ.2,699 సొంతం చేసుకోవచ్చు. ఇంకా Dell, HP, Lenovo కంపెనీలకు చెందిన కొత్త పీసీలు కూడా లాంచ్ కాబోతున్నాయి. లాంచ్ ఆఫర్‌తో పాటు, ప్రైమ్ డే సేల్‌ క్రింద అతి తక్కువ ధరలో వీటిని కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed