- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన HP.!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్దం అవుతున్నాయి. మెటా, ట్విట్టర్, అమెజాన్, గూగుల్ కంపెనీ వంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నప్పటికీ.. తాజాగా అలాంటి జాబితాలో కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ కూడా చేరింది. వచ్చే మూడేళ్లలో 4,000 నుంచి 6,000 మంది ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తున్నట్లు మంగళవారం తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. హెచ్‌పీ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 51,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు నివేదించింది.
కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి, సంస్థ ఖర్చులను తగ్గించడం వంటివి ప్లాన్ చేస్తున్నట్లు హెచ్‌పీ సీఈఓ ఎన్రిక్ లోర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధి కార్యక్రమంలో తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. కాగా, మునుపటి త్రైమాసికంలో వ్యక్తిగత సిస్టమ్స్ ఆదాయం 3% క్షీణించడం, ప్రింటింగ్ ఆదాయం 6% తగ్గిందని తెలిపింది. ఈ విభాగంలో వినియోగదారుల ఆదాయం 25% పడిపోయిందని సంస్థ పేర్కొంది.