Honda Amaze 2024: హోండా నుంచి న్యూ అమేజ్ కారు లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే..!

by Maddikunta Saikiran |
Honda Amaze 2024: హోండా నుంచి న్యూ అమేజ్ కారు లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
X

దిశ, వెబ్‌‌డెస్క్: జపాన్(Japan) కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా(Honda) కొత్త అమేజ్(Amaze) కారును విడుదల చేసింది. 'హోండా అమేజ్ 2024(Honda Amaze 2024)' పేరుతో దీన్ని దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు వీ(V), వీఎక్స్(VX), జడ్ఎక్స్(ZX) అనే మూడు వేరియంట్(Three Variant)లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధరను రూ. 7,99,000(Ex-Showroom)గా నిర్ణయించారు. టాప్ మోడల్(జడ్ఎక్స్) ధర రూ.10.90 లక్షలుగా ఉంది. ఈ కారును అడ్వాన్స్డ్ డ్రైవర్ అస్సిస్టెన్స్ సిస్టమ్(ADAS)తో తీసుకొచ్చారు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కొత్త అమేజ్ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 89 bhp పవర్(Power), 110 Nm పీక్ టార్క్(peek Torque)ను ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజి పరంగా చూస్తే.. మాన్యువల్ ట్రాన్స్మిషన్(MT) లీటర్ కు 18.65 కి. మీ, సీవీటీ వేరియంట్(CVT) లీటర్ కు 19.46 కిలో మీటర్లు ఇస్తుంది. ఇక కారు లోపల 8 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, యాపిల్ కార్ ప్లే, రియర్ ఏసీ వెంట్స్, వైర్లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైర్, వాక్ అవే ఆటోలాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇక ఎక్స్టీరియర్ విషయానికొస్తే ఫ్రంట్ సైడ్ డీఆర్ఎల్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, LED ఫామ్గ్ ల్యాంప్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా LED టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. అలాగే 15 అంగుళాల డ్యూయల్ టోన్ అలయ్ వీల్స్ ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed