- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hero Passion Plus.. అదిరిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి రీ ఎంట్రీ !
దిశ,వెబ్‌డెస్క్: హీరో ప్యాషన్ ప్లస్మార్కెట్లోకి మళ్లీ రానుంది. పాత మోడల్లోనే కొత్త ఫీచర్లతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. ప్యాషన్ ప్లస్‌ను తిరిగి ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది! ఈ నెల్లోనే హీరో ప్యాషన్ ప్లస్ 2023 మోడల్ రోడ్ల మీద దర్శనమిస్తుందని తెలుస్తోంది.
మంచి ఫ్యామిలీ బైక్ ఆదరణ: మంచి మైలేజ్‌తో పాటు ఫ్యామిలీబైక్ పేరుతెచ్చుకున్న హీరో మోడల్ బైక్‌లలో ప్యాషన్ ప్లస్ కూడా ఒకటి. 2001లో 'ప్యాషన్'ను ఇండియాలోకి తీసుకొచ్చింది హీరో మోటోకార్ప్. అనేక ఏళ్ల పాటు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఈ మోడల్‌ను సంస్థ తయారు చేయడం ఆపడంతో ప్యాషన్ ప్లస్‌కు మాత్రం కాస్త బ్రేక్ వచ్చింది. . ఇప్పుడు తన పోర్ట్‌ఫోలియోను పెంచుకోవాలని చూస్తున్న హీరోమోటో కార్ప్.. కొత్త కొత్త మోడల్స్‌తో పాటు పాత వాటిని తిరిగి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ప్యాషన్ ప్లస్ త్వరలోనే ఇండియాలోకి తిరిగి అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
హీరో ప్యాషన్ ప్లస్ ..లుక్ పరంగా దానికి అదే సాటి: డిజైన్ పరంగా చూసుకుంటే.. హీరో ప్యాషన్ ప్లస్‌లో స్వల్పంగా అప్‌గ్రేడ్స్ ఉంటాయని తెలుస్తోంది. ఇందులో మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, సెమీ- ఫైర్డ్ హెడ్‌ల్యాంప్ యూనిట్, స్మాల్ విండ్ డిఫ్లెక్టర్, ఫ్లాట్ టైప్ సింగిల్ పీస్ సీట్, వైడ్ హ్యాండిల్‌బార్, ఓవల్ షేప్ మిర్రర్స్, సైడ్ మౌంటెడ్ ఎగ్సాస్ట్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి లభిస్తాయి. బ్లాక్డ్ ఔట్ మల్టీ స్పోక్ అలాయ్ వీల్స్ కూడా కొత్త ప్యాషన్ ప్లస్‌లో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్యాషన్ ప్లస్ అదిరిపోయే ఇంజన్: ఈ మోడల్లో 97.2సీసీ, ఎయిర్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్, బాక్సర్ టైప్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇటీవల స్ప్లెండర్ ప్లస్ మోడల్లోనూ ఇదే ఉంది. ఈ ఇంజిన్ 8హెచ్‌పీ పవర్‌ను, 8ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
సేఫ్టీలోని రాజీలేదు:ఈ బైక్ ఫ్రెంట్లో డిస్క్ బ్రేక్, రేర్‌లో డ్రమ్ బ్రేక్ ఉండొచ్చు. కంబైండ్ బ్రేకింగ్ సిస్టెమ్ వంటి ఫీచర్స్ చేర్చనున్నారు. సస్పెషన్స్ కోసం ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో అడ్జెస్టెబుల్ డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్ వంటివి ఈ మోడల్లో ఉండే అవకాశం ఉంది.
సరసమైన ధరలోనే ప్యాషన్ ప్లస్: హీరో ప్యాషన్ ప్లస్ లాంచ్ డేట్‌తో పాటు ధరకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 75వేలకు పైగా ఉండే అవకాశం ఉంది.
Also Read..
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల హవా.. అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే!