- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPO: రూ.900 కోట్ల ఐపీఓకు సిద్ధమైన హీరో మోటార్స్
దిశ, బిజినెస్ బ్యూరో: హీరో గ్రూప్ ఆధ్వర్యంలోని ఆటో-కాంపోనెంట్స్ కంపెనీ అయిన హీరో మోటార్స్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌కు(ఐపీఓ) రావడానికి సిద్ధమైంది. దీని ద్వారా సంస్థ దాదాపు రూ.900 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ)ని సమర్పించింది.
ఆగస్టు 23న కంపెనీ దాఖలు చేసిన ప్రాథమిక పత్రాల ప్రకారం, ఈ ఐపీఓలో కంపెనీ ప్రమోటర్లు రూ.500 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంచుతారు. అలాగే, ప్రమోటర్ ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ ఓఎఫ్‌ఎస్ ద్వారా రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. భాగ్యోదయ్ ఇన్వెస్ట్‌మెంట్స్, హీరో సైకిల్స్ ఒక్కొక్కటి రూ.75 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి ఉంచుతాయి. అదనంగా, హీరో మోటార్స్ ప్రీ-ఐపీఓ ద్వారా రూ.100 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ ఇది విజయవంతం అయితే సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కేటాయించిన ఐపీఓ మొత్తాన్ని తగ్గించనున్నారు.
హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజల్ సోదరుడు ఓపీ ముంజాల్. ఈయనకు ప్రస్తుతం హీరో మోటార్స్‌లో 71.55 శాతం వాటా ఉంది. భాగ్యోదయ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు 6.28 శాతం, హీరో సైకిల్స్ 2.03 శాతం, ఇన్వెస్టర్ సౌత్ ఏషియా గ్రోత్ ఇన్వెస్ట్ LLC 12.27 శాతం వాటా ఉంది
హీరో మోటార్స్ యునైటెడ్ స్టేట్స్, యూరప్, భారతదేశంలోని ఆటోమోటివ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో సహా పవర్‌ట్రెయిన్ సొల్యూషన్‌లను అందిస్తుంది. ద్విచక్ర వాహనాలు, ఈ-బైక్‌లు, ఆఫ్-రోడ్ వాహనాలు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు, హెవీ-డ్యూటీ వాహనాలు, విమానాల తయారీదారులకు ట్రాన్స్‌మిషన్ కాంపోనెంట్స్‌ను విక్రయిస్తుంది. కంపెనీ గ్లోబల్ కస్టమర్ బేస్‌లో BMW AG, డుకాటి మోటార్ హోల్డింగ్ SPA, ఎన్వియోలో ఇంటర్నేషనల్ ఇంక్ వంటి ప్రసిద్ధ సంస్థలు ఉన్నాయి.