- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
USB ఫీచర్‌తో హీరో HF డీలక్స్ బైక్
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ మార్కెట్లోకి USB ఫీచర్‌తో హెచ్‌ఎఫ్ డీలక్స్(HF డీలక్స్) బైక్‌ను లాంచ్ చేసింది. దీనిలో కిక్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్లు ఉన్నాయి. కిక్ వేరియంట్ ధర రూ. 60,760 నుండి ప్రారంభమవుతుంది. అదే సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 66,408 నుంచి మొదలవుతుంది. దీని డిజైన్ ప్రతి వినియోగదారున్ని ఆకట్టుకుంటుందని కంపెనీ తెలిపింది. బైక్ నెక్సస్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే విత్ బ్లాక్, బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ వేరియంట్లు దేశవ్యాప్తంగా అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
HF డీలక్స్‌లో USB చార్జర్‌ను అందించారు. టైర్లు ట్యూబ్‌లెస్ ఫీచర్‌తో కూడిన సెల్ఫ్, సెల్ఫ్ ఐ3ఎస్ వేరియంట్‌లతో వచ్చాయి. సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఉంది. HF డీలక్స్ 97.2cc ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. దీనిలో 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 9.6 లీటర్లుగా ఉంది.