BANK: కస్టమర్లకు షాక్.. రుణ రేటును పెంచిన HDFC బ్యాంక్

by Harish |   ( Updated:2024-09-07 10:39:05.0  )
BANK: కస్టమర్లకు షాక్.. రుణ రేటును పెంచిన HDFC బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం HDFC బ్యాంక్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటను (MCLR) 5 బేసిస్ పాయింట్ల (bps) మేర పెంచింది. అయితే 3 నెలల కాల వ్యవధి మినహా ఎలాంటి రుణ రేట్లను బ్యాంక్ సవరించలేదు. మూడు నెలల కాలానికి రుణ రేటు 9.25 శాతం నుండి ఇప్పుడు 9.30 శాతానికి పెరిగింది. ఈ పెంపు సెప్టెంబర్ 7 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో చూపిస్తుంది.

వడ్డీ రేట్లు ప్రస్తుతం 9.10% నుంచి 9.45% మధ్య ఉన్నాయి. ఓవర్‌నైట్ వడ్డీరేటు 9.10%, ఒక నెలకు 9.15%, మూడు నెలల వ్యవధి కాలానికి మాత్రం ఇంతకుముందు 9.25% ఉండగా ఇప్పుడు 5 bps పాయింట్ల పెంపుతో 9.30%కి పెరిగింది. ఆరు నెలలకు 9.40%, ఒక సంవత్సరం కాలానికి 9.45% వద్ద ఉంది. ఈ పెంపుదలతో బ్యాంక్ నుంచి మూడు నెలల కాలానికి తీసుకునే హోమ్‌లోన్, వ్యాపార, వ్యక్తిగత రుణంపై వడ్డీ పెరగనుంది. MCLR కంటే తక్కువకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అధికారం లేదు.

Advertisement

Next Story

Most Viewed