HDFC Bank: ఖాతాదారులుకు గుడ్‌న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్

by Harish |   ( Updated:2024-07-24 07:26:52.0  )
HDFC Bank: ఖాతాదారులుకు గుడ్‌న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రైవేటు రంగ దిగ్గజం HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తం గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటును పెంచింది. పెరిగిన ఈ కొత్త వడ్డీ రేట్లు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. పెంపు తర్వాత, సాధారణ పౌరులకు గరిష్టంగా 7.40 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.90 శాతం గరిష్ట వడ్డీ రేటు లభిస్తుంది.

బ్యాంక్ తన అధికారిక సైట్‌లో పేర్కొన్నదాని ప్రకారం, వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 నుండి 29 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 30-45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం, 46 రోజుల నుండి ఆరు నెలల లోపు ఎఫ్‌డీలపై 4.50 శాతం, ఒక సంవత్సరం-15 నెలల లోపు 6.60 శాతం,15 నెలల నుండి 18 నెలల లోపు 7.10 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 18 నెలల నుండి 21 నెలలకు 7.25 శాతం. 21 నెలలు - రెండు ఏళ్ల పదకొండు నెలల లోపు 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్కువ వడ్డీ ఉంది.

Advertisement

Next Story

Most Viewed