- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
GST: ఆగస్టులో 10 శాతం పెరిగిన జీఎస్టీ ఆదాయం
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఆగష్టు నెలకు సంబంధించి జీఎస్టీ ఆదాయం భారీగా నమోదైంది. గత నెల జీఎస్టీ వసూళ్లు రూ. 1,74,962 కోట్లు వచ్చాయని, ఈ మొత్తం గతేడాదితో పోలిస్తే 10 శాతం అధికమని ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు నెల జూలైలో రూ. 1,82,075 కోట్లు వసూలయ్యాయి. 2023, ఆగష్టులో జీఎస్టీ రూ. 1,59,069 కోట్లుగా నమోదైంది. ఆగష్టులో వచ్చిన జీఎస్టీ రాబడిలో సీజీఎస్టీ రూ.30,862 కోట్లకు, ఎస్‌జీఎస్టీ రూ.38,411 కోట్లకు పెరిగాయి. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలను కలుపుకొని ఐజీఎస్టీ రూ. 93,621 కోట్లకు, సెస్ వసూళ్లు రూ.12,068 కోట్లకు చేరాయి. అలాగే, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎనిమిది నెలల్లో జీఎస్టీ ఆదాయం 10.1 శాతం అధికంగా రూ. 9.13 లక్షల కోట్లు వచ్చాయి. 2023 నాటి ఇదే కాలంలో రూ. 8.29 లక్షల కోట్ల రాబడి నమోదైంది. ప్రభుత్వ డేటా ప్రకారం గత నెలలో దేశీయంగా కార్యకలాపాల నుంచి రూ. 1.25 లక్షల కోట్ల వరకు ఆదాయం ప్రభుత్వానికి చేరింది. ఇది 9.2 శాతం వృద్ధి చెందింది. వస్తు దిగుమతుల నుంచి జీఎస్టీ రాబడి 12.1 శాతం పెరిగి రూ. 49,976 కొట్లు వచ్చాయి. ఆగష్టు నెలలో రూ. 24,460 కోట్ల రీఫండ్లు అందించారు.