- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Steel Industry: స్టీల్ రంగానికి మరో రౌండ్ పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించనున్న కేంద్రం
దిశ, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగానికి సంబంధించి మరో ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది. 'పీఎల్‌ఐ స్కీమ్ 1.1'ని పేరుతో ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సోమవారం ప్రారంభించనున్నారు. అలాగే, సోమవారం నుంచి దరఖాస్తులను ఆహ్వానించనున్నట్టు ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఈ పరిశ్రమలో దేశీయంగా స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి పెట్టుబడులను ఆహ్వానించి దిగుమతులు తగ్గించేందుకు గతంలో ప్రభుత్వం ఈ రంగానికి పీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పీఎల్ఐ పథకం ఈ రంగం ద్వారా రూ. 27,106 కోట్ల విలువైన పెట్టుబడులను, 79 లక్షల టన్నుల స్పెషాలిటీ స్టీల్‌ను ఉత్పత్తి, 14,760 ప్రత్యక్ష ఉద్యోగాలని కల్పించే లక్ష్యం సాధిస్తుందని అంచనా. గణాంకాల ప్రకారం.. 2024, నవంబర్ నాటికి ఈ రంగంలో ఇప్పటికే రూ. 18,400 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 8,600 మందికి పైగా ఉపాధిని సృష్టించింది. ఈ నేప్థ్యంలో ఈ రంగంలోని కంపెనీలతో సంప్రదించడం ద్వారా స్టీల్ పరిశ్రమకు మరింత మద్దతు ఇచ్చేందుకు, మరో రౌండ్ పీఎల్ఐ పథకాన్ని అందించాలని ప్రభుత్వం భావించినట్టు ఓ అధికారి చెప్పారు.