'యూపీఐ లావాదేవీలపై 0.3 శాతం ఛార్జీ'!

by S Gopi |
యూపీఐ లావాదేవీలపై 0.3 శాతం ఛార్జీ!
X

ముంబై: డిజిటల్ లావాదేవీలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చేందుకు, చెల్లింపుల వ్యవస్థ ఆర్థిక సమర్థత కోసం యూపీఐ లావాదేవీలపై కొంత మొత్తం ఛార్జీ విధించాలని ఓ నివేదిక సూచించింది. ఐఐటీ బాంబే అధ్యయనం ప్రకారం, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ లావాదేవీలపై స్వల్పంగా 0.3 శాతం నామమాత్ర ఛార్జీలను విధించాలి. యూపీఐ లావాదేవీల ఆమోదం, ప్రాసెస్, ఇతర ఖర్చులను పరిగణలోకి తీసుకుని ఛార్జీలు ఉండాలి. దీనివల్ల ప్రభుత్వం 2023-24లో దాదాపు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని 'పీపీఐ-ఆధారిత యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు' పేరుతో విడుదల చేసిన నివేదికలో అభిప్రాయపడింది. ఆ మొత్తాన్ని యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఉపయోగించవచ్చు. ఇటీవల ఎన్‌పీసీఐ యూపీఐ ద్వారా చేసే వ్యాపారులు ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ కోసం రూ. 2 వేల కంటే ఎక్కువ లావాదేవీపై 1.1 శాతం సర్‌ఛార్జ్ విధిస్తూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో వ్యాపారులపై మాత్రమే భారం ఉంటుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. అయితే, పీపీఐ ఛార్జీల కారణంగా వినియోగదారులు రాయితీలను కోల్పోతారని నివేదిక అభిప్రాయపడింది.

Advertisement

Next Story