యూకో బ్యాంకు సీఈఓగా అశ్వని కుమార్‌ను నియమించిన ప్రభుత్వం!

by Harish |
యూకో బ్యాంకు సీఈఓగా అశ్వని కుమార్‌ను నియమించిన ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా అశ్వనీ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. సోమశంకర ప్రసాద్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, యూకో బ్యాంక్ ఎండీ, సీఈఓగా అశ్వనీ కుమార్ మూడేళ్ల కాలం బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది జూన్ 1 నుంచి మొదలై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగనున్నారు.

ప్రస్తుతం యూకో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న అశ్వనీ కుమార్ గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన కుమార్ బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియన్ బ్యాంకుల్లో సైతం వివిధ బాధ్యతలను నిర్వహించారు. ముఖ్యంగా హోల్‌సేల్ బ్యాంకింగ్, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ విభాగాలతో పాటు జనరల్ మేనేజర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వంటి బాధ్యతల్లో పనిచేశారు.

Advertisement

Next Story