మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by Kavitha |   ( Updated:2024-06-22 05:37:31.0  )
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవల బంగారం ధరలు భారీగా పెరుగుతూ కొనుగోలు దారులను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల తర్వాత నుంచి బంగారం ధరలు అమాంతం పెరుగుతూ జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం పెళ్లి ముహుర్తాలు అంతగా లేకపోవడంతో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో జనాలు బంగారం కొనుగోలు చేయడానికి షాపులకి పరుగులు పెడుతున్నారు.

నిన్నటితో పోలిస్తే.. నేడు బంగారం ధరలు భారీగా తగ్గి కొనుగోలు దారులకు ఊరట నిచ్చాయి. 22 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ. 800 తగ్గడంతో రూ. 66,350కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ. 870 తగ్గి రూ. 72, 380 కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండి విషయానికొస్తే రూ.2000 దిగి రూ. 96,500గా ఉంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,350

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,380

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,350

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 72,380

Advertisement

Next Story