- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jio Recharge Plans:జియో యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఆ ప్లాన్లు మళ్లీ వచ్చాయ్!
దిశ,వెబ్‌డెస్క్: జియో వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్. టెలికాం రంగంలో సంచలనం గా నిలిచిన రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల జియో..తన రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జూలై నుంచే పెరిగిన రేట్లు అమలులోకి వచ్చాయి. జియో బాటలోనే ఎయిర్‌టెల్, వీఐ కూడా రీఛార్జ్ ప్లాన్స్ రేట్లను పెంచాయి. దీంతో వినియోగదారులు బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రముఖ వ్యాపార వేత్త అయిన గౌతమ్ అదానీ కూడా టెలికాం రంగంలోకి వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జియో తన యూజర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. గతంలో తీసేసిన పాపులర్ ప్లాన్లను తిరిగి ప్రారంభించనుంది.
గౌతం అదానీతో పాటు మరికొందరు టాప్ బిజినెస్‌మెన్ టెలికాం సర్వీసెస్‌లోకి అడుగుపెడతారనే వార్తల నేపథ్యంలో జియో తన యూజర్ల కోసం కొన్ని పాత రీఛార్జ్ ప్లాన్లను మళ్లీ తీసుకొచ్చింది. రూ.299 రీఛార్జ్ ప్లాన్ తో 28 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ నెట్ తో మొత్తం 42 జీబీ లభిస్తుంది. అలానే రూ.249 రీఛార్జ్ ప్లాన్ తో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ డేటాతో మొత్తం 28 జీబీ అందించనుంది. అదే విధంగా రూ.209 ప్లాన్ తో 22 రో జులు, 1జీబీ , మొత్తం 22 జీబీ డేటా అందనుంది. ఇక చివరి ప్లాన్ అయినా రూ.199 రీఛార్జ్‌తో 18 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీడేటాతో మొత్తం 27 జీబీ లభించనుంది. ఇక ఈ అన్ని ప్లాన్లలోనూ జియో ఎంటర్టైన్మెంట్ సర్వీస్ కూడా లభిస్తుంది. అయితే ఇదే సమయంలో ఓ రెండు ప్లాన్ ల విషయంలో కూడా జియో కీలక నిర్ణయం తీసుకుంది. జియోలో ఎంతో పాపురల్ అయిన అన్‌లిమిటెడ్ 5 జీ ప్లాన్స్ రూ .395, రూ .1,559 ప్రీపెయిడ్ ప్లాన్లే అని చెబుతారు. చాలా మంది వీటినే రీఛార్జ్ చేసుకుంటారు. అయితే తాజాగా జియో ఈ ప్రిపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినట్లు సమాచారం.