- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోల్డ్‌మన్ శాక్స్‌లో 3,200 మంది ఉద్యోగుల తొలగింపు!
న్యూఢిల్లీ: కార్పొరేట్ రంగంలో ఆర్థిక మాంద్యం భయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దీని ప్రభావంతో అనేక దిగ్గజ కంపెనీలు భారీ సంఖ్యలో తొలగింపులను చేపట్టాయి. తాజాగా, అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తన చరిత్రలోనే అత్యధిక ఉద్యోగాలను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కార్పొరేట్ ఒప్పందాలు తగ్గిపోతున్న నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ సుమారు 3,200 మంది ఉద్యోగులను సాగనంపనుంది. ఇవన్నీ గోల్డ్‌మన్ శాక్స్‌లోని కీలక బ్యాంకింగ్, ట్రేడింగ్ విభాగల్లోనే కావడం గమనార్హం. తొలగింపులు ఉన్నప్పటికీ కొత్తగా నియామకాలు మాత్రం కొనసాగుతాయని కంపెనీ చెబుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా గోల్డ్‌మన్ శాక్స్‌కు చెందిన వ్యాపారాల్లో రాబడి తగ్గింది. దీనికితోడు కంపెనీ బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టేందుకు ఎక్కువ ఖర్చులు చేస్తుండటం, ఇతర కారణాలతో వ్యయ నియంత్రణకు శ్రీకారం చుట్టింది. దీనిపై స్పందించిన యాజమాన్యం తొలగింపుల ప్రక్రియ ఉంటుందని చెప్పినప్పటికీ, ఎంతమంది అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి : గ్లోబల్ బిజినెస్ హెడ్‌గా వికాస్‌ను నియమించిన మెటా!