ఈరోజు బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

by samatah |   ( Updated:2023-07-03 03:44:20.0  )
ఈరోజు బంగారం ధరలు.. తులం ఎంత అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందుగా బంగారం కొనుగోలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు.

అయితే గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా, నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,070గా ఉంది.

Also Read: జూలై-3: నేడు తెలుగు రాష్ట్రాల్లో LPG గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే..

Advertisement

Next Story