- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షాకిస్తున్న బంగారం.. వరుసగా మూడోరోజు భారీగా పెరిగిన ధరలు
దిశ, వెబ్ డెస్క్: గతవారం 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.3000 మేర తగ్గిన బంగారం ధర.. ఈ వారం ఆరంభం నుంచీ వరుసగా పెరుగుతూ.. కొనుగోలు దారులకు షాకిస్తోంది. నవంబర్ 17 (ఆదివారం) 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లు రూ.69,350, 24 క్యారెట్లు రూ.75,650 ఉండగా.. ఇప్పుడు 71 వేల రూపాయల నుంచి రూ.77 వేల వరకూ పెరిగింది. దీంతో కొనుగోలు దారులు బంగారాన్ని కొనాలంటే ఆలోచిస్తున్నారు.
బుధవారం ఉదయం 11 గంటలకు బంగారం ధరలు మారాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.500, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.550 మేర ధర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,150కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,620కి పెరిగింది.
స్థిరంగా వెండి..
బంగారం ధర పెరగ్గా.. వెండి ధర స్థిరంగా ఉంది. నవంబర్ 15 నుంచి 18 వరకూ ఎలాంటి పెరుగుదల లేని వెండికి.. నిన్న రెక్కలొచ్చాయి. ఒకేసారి కేజీ వెండి ధరపై రూ.2000 పెరగడంతో.. మళ్లీ లక్ష మార్కును దాటేసింది. నవంబర్ 14 నుంచి 18 వరకూ రూ.99,000 ఉన్న వెండి ధర నిన్న రూ.1,01,000కు చేరింది. నేడు కూడా అదే ధర కొనసాగుతోంది.