- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FSSAI: ఆహార పదార్థాలలో యాంటీబయాటిక్స్ వాడకంపై నిబంధనలు కఠినతరం చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫుడ్ సేఫ్టీ నియంత్రణ సంస్థ యాంటీబయాటిక్స్ వాడకంలో నిబంధనలను కఠినతరం చేసింది. మాంసం, మాంస ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, గుడ్లు, ఆక్వాకల్చర్ కోసం వాడే యాంటీబయాటిక్స్ నిబంధనలను కఠినతరం చేసింది. అనుమతించిన స్థాయిలను తగ్గించి, మరిన్ని ఔషధాలను పరిశీలించాల్సిన జాబితాలో ఉంచింది. డ్రగ్స్ 'దుర్వినియోగం' కారణంగా యాంటీబయాటిక్స్, ఇతర మందుల వాడకంలో ఏర్పడే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి 'సూపర్ బగ్స్' సమస్యను పరిష్కరించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎసేఐ) తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. సవరించిన నిబంధనలు 2025, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. వినియోగదారులకు సురక్షితమైన వివిధ రకాల ఆహార పదార్థాలను అందించడం కోసం నిబంధనలు కఠినతరం చేసినట్టు వినియోగదారుల రక్షణ సంఘం(సీపీఏ) వర్కింగ్ ప్రెసిడెంట్ జార్జ్ చెరియన్ అన్నారు. అంతేకాకుండా తేనె ఉత్పత్తి సమయంలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధించింది. గోధుమ, గోధుమ ఊక, బార్లీ, రై, కాఫీలలోని ఓక్రాటాక్సిన్ ఏ, డియోక్సినివాలెనాల్ రసాయనాల పరిమితిని రీసెట్ చేసింది.