Post Office super hit Scheme: కేవలం రూ.5 వేల పెట్టుబడితో సొంతంగా వ్యాపారం..

by Admin |   ( Updated:2022-10-08 16:48:43.0  )
Post Office super hit Scheme: కేవలం రూ.5 వేల పెట్టుబడితో సొంతంగా వ్యాపారం..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే బదులు కొంతమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే కొందరు తమ ఉద్యోగాలను మానేసి సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టారు. మరికొంత మంది ఏ వ్యాపారం ప్రారంభించాలో తెలియక ఆలోచనలో ఉన్నారు.సొంత వ్యాపారం అంటే పెట్టుబడి పెట్టాలి. మొదలు పెట్టబోయే వ్యాపారాన్ని బట్టి ఎంత అమౌంట్ కావాలో ముందే సర్దుకోవాలి. కొందరు తమ దగ్గర సరిపడా డబ్బు లేక వ్యాపారం ఎలా ప్రారంభించాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టాఫీసు కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీ పథకం ద్వారా కేవలం రూ.5 వేల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టి మంచి లాభాలను పొందవచ్చు.

పోస్టాఫీసు దేశవ్యాప్తంగా 1.56 లక్షల బ్రాంచ్‌లను కలిగి ఉంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోస్టాఫీసు సేవలకు డిమాండ్ కూడా అధికంగా ఉంది. ఈ డిమాండ్‌ను తీర్చడానికి రెండు రకాల ఫ్రాంచైజీలను పోస్టాఫీసు అందిస్తోంది. మొదటిది ఫ్రాంచైజీ అవుట్‌లెట్లు, రెండొది పోస్టల్ ఏజెంట్లు. అవసరమైన చోట కౌంటర్ సేవలను అందించడానికి ఫ్రాంచైజ్ అవుట్‌లెట్‌లను తెరవవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ స్టాంపులు, స్టేషనరీలను విక్రయించే పోస్టల్ ఏజెంట్లుగా కూడా చేయవచ్చు. పోస్టాఫీసులపై భారం పడకుండా చిన్న చిన్న సేవలను ప్రజలకు అందించడానికి ఈ కొత్త ఫ్రాంచైజీ అవుట్‌లెట్లు, ఏజెంట్లు బాగా ఉపయోగపడుతాయి. వీటిని ఏర్పాటు చేసి కమిషన్ల ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ప్రారంభించడానికి అర్హత

* ఫ్రాంచైజీని తీసుకునే వ్యక్తి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.

* గుర్తింపు పొందిన పాఠశాల నుండి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

* పోస్టల్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఫ్రాంచైజీ పథకాన్ని పొందలేరు.

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజీ పథకంతో సంపాదన

* స్పీడ్ పోస్ట్ బుకింగ్ కోసం, ఒక్కో లావాదేవీకి కమిషన్ రూ. 5.

* రూ. 100, రూ. 200 మధ్య మనీ ఆర్డర్ బుకింగ్‌లపై రూ. 3.50 కమిషన్ వస్తుంది. రూ. 200 కంటే ఎక్కువ ఉన్న మనీ ఆర్డర్ ప్రతి లావాదేవీకి రూ. 5 లను అందిస్తుంది.

* ఫ్రాంచైజీ ఏజెంట్లు రూ. 100 కంటే తక్కువ మనీ ఆర్డర్‌లను బుక్ చేయరు.

* నెలవారీ 1000 స్పీడ్ పోస్ట్ బుకింగ్‌ల లక్ష్యాన్ని చేరుకుంటే 20% అదనపు కమిషన్ వస్తుంది.

* రిజిస్టర్డ్ పోస్టు బుకింగ్‌ కోసం ఒక్కో లావాదేవీకి రూ.3 కమిషన్ తీసుకోవచ్చు.

* పోస్టల్ స్టాంపులు స్టేషనరీ అమ్మకంపై, కమిషన్ 5%.

* రెవెన్యూ స్టాంపులు, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీజు స్టాంపులు వంటి రిటైల్ సర్వీసుల అమ్మకం ద్వారా పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఆర్జించే ఆదాయాలపై 40 శాతం కమిషన్‌ను వస్తుంది.

పోస్ట్ ఆఫీస్‌తో ఫ్రాంచైజ్ పథకం కోసం దరఖాస్తు చేయడానికి పోస్టాఫీసులో సంప్రదించండి. దరఖాస్తు ఫారమ్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకొవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి :

Post Office Schemes: 14లక్షలు మీ సొంతం.. ఆ పథకంలో మీరు ఉన్నారా.?

ఎట్టకేలకు విడాకులపై క్లారిటీ ఇచ్చిన సమంత.. ?

ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించిన కెనరా బ్యాంకు!

Advertisement

Next Story

Most Viewed