ఆరు నెలల తర్వాత భారత ఈక్విటీల్లో విదేశీ మదుపర్ల అమ్మకాలు!

by Vinod kumar |
ఆరు నెలల తర్వాత భారత ఈక్విటీల్లో విదేశీ మదుపర్ల అమ్మకాలు!
X

ముంబై: భారత ఈక్విటీల్లో వరుస ఆరు నెలలపాటు షేర్లను కొన్న విదేశీ మదుపర్లు సెప్టెంబర్‌లో అమ్మకాలకు మొగ్గు చూపారు. ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ విలువ, బాండ్ల రాబడి పుంజుకోవడం వంటి పరిణామాలతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ. 14,000 కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. దేశ ఆర్థికవ్యవస్థ, ఆర్‌బీఐ అక్టోబర్ ఎంపీసీ సమావేశం, సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎఫ్‌పీఐల ధోరణి అనిశ్చితిగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 14,767 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ మదుపర్ల పెట్టుబడులు రూ. 1.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. డెట్ మార్కెట్లో రూ. 938 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా కేపిటల్ గూడ్స్, ఫైనాన్స్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed