- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇకపై కారులోంచే పెట్రోల్ బంకుల్లో చెల్లింపులు!
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానంలో సరికొత్త ఆవిష్కరణ ప్రారంభమైంది. ఇప్పటివరకు చాలావరకు అవసరాలకు ఆన్‌లైన్ లావాదేవీలు, చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. కార్డు ద్వారా స్వైపింగ్ లేదా స్మార్ట్‌ఫోన్ ఉంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై పెట్రోల్ బంకుల్లోనూ ఇవేమీ లేకుండా కారు నుంచే చెల్లింపులు చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చేసింది. అంతేకాకుండా ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు.
తాజాగా 'పే బై కార్ ' పేరుతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, చెల్లింపుల సంస్థ మాస్టర్‌కార్డ్ మద్దతున్న టోన్‌ట్యాగ్ కంపెనీ ఈ కొత్త డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని మొదలుపెట్టింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)ని కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అనుసంధానం చేసి ఈ చెల్లింపులను చేయవచ్చు. ఈ మధ్యే కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్‌కు చెందిన హెటాక్ కార్డు, ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం భాగస్వామ్యంతో ఈ చెల్లింపులను ప్రయోగాత్మకంగా పరీక్షించాయి. ఈ కొత్త విధానంలో పెట్రోల్ బంకు వద్దకు వెళ్లిన సమయంలో కారులో ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఫ్యుయెల్ డిస్‌పెన్సర్ నంబర్ చూపిస్తుంది. ఇది అనౌన్స్‌మెంట్ రూపంలో వినిపించడమే కాకుండా పెట్రోల్ బంకు సిబ్బందిని సైతం అలర్ట్ చేస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై ఎంత ఇంధనం కావాలో నమోదు చేస్తే సరిపోతుంది. చెల్లింపుల తర్వాత అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కనిపిస్తుంది.