రెండో వారంలో కూడా కొనసాగిన విదేశీ పెట్టుబడులు: జియోజిత్ ఫైనాన్షియల్

by Harish |
రెండో వారంలో కూడా కొనసాగిన విదేశీ పెట్టుబడులు: జియోజిత్ ఫైనాన్షియల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు మార్చి మొదటివారంలో ఆశించిన మేరకు రాగా, రెండో వారంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ చెప్పారు. ఈ ఏడాది జనవరి నెలలో విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలను ఎక్కువగా జరపగా, ఆ తర్వాత ఫిబ్రవరిలో తిరిగి కొనుగోళ్లను జరిపారు. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, వారు మార్చి 15 నాటికి భారత ఈక్విటీల్లో రూ. 35,665 కోట్ల కొనుగోళ్లను జరిపినట్లు తెలుస్తోంది. అమెరికాలో బాండ్ ఈల్డ్‌లలో వడ్డీ రేట్లలో మార్పులు చేసినట్లయితే ఈ ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. మార్చిలో మార్కెట్‌లో మిడ్, స్మాల్‌క్యాప్‌లలో బలహీనత, లార్జ్‌క్యాప్‌లలో స్థితిస్థాపకత ఉంది. బ్యాంకింగ్, టెలికాం, ఆటోమొబైల్స్ వంటి రంగాలలో పెద్ద క్యాప్‌లలో అమ్మకాలను తగ్గించి, పరిమిత పరిమాణంలో కొనుగోళ్లు చేయడానికి విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి కలిగి ఉన్నారని స్ట్రాటజిస్ట్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed