- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FED: నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపుకు సిద్ధమైన ఫెడ్
దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 18(బుధవారం) నాడు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ దీనికి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. 2020 నుంచి ఇప్పటి వరకు కూడా వడ్డీ రేట్లు తగ్గించని ఫెడ్ ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఈ చర్యకు సిద్ధమైంది. నవంబర్ 2024 లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నెలల ముందు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యమైన రెండు శాతానికి తగ్గుతుండటం, ఆహార పదార్థాలు, వస్తువుల ధరలు దిగి రావడంతో వడ్డీరేట్లను తగ్గించాలని గత ఫెడ్ సమావేశంలో నిర్ణయించారు. ఫెడ్ ఛైర్మన్ కూడా రేట్లను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నామని గత నెల ఒక అధికారిక సమావేశంలో వెల్లడించారు.
లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణం జులై నెలలో 2.5 శాతానికి పడిపోయింది. ఇది రెండేళ్ల క్రితం గరిష్ట స్థాయి 7.1 శాతం కంటే చాలా తక్కువ, సెంట్రల్ బ్యాంక్ 2 శాతం లక్ష్య స్థాయి కంటే కొంచెం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా ఇది సానుకూల స్థితిలోనే ఉందని ఫెడ్ సీనియర్ అధికారులు తెలిపారు. వడ్డీ రేట్ల తగ్గింపు ఎంత వరకు ఉంటుందనేది మాత్రం ప్రకటించలేదు. మార్కెట్ వర్గాల ప్రకారం, 25 బేసిస్ పాయింట్లు లేదా 50 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించే అవకాశం ఉందని తెలుస్తుంది. గత 14 నెలలుగా రెండు దశాబ్దాల గరిష్ట స్థాయి 5.25-5.50 శాతం మధ్య వడ్డీ రేటు ఉంది.