జీ20 దేశాల్లో అత్యంత వేగంగా భారత వృద్ధి

by S Gopi |
జీ20 దేశాల్లో అత్యంత వేగంగా భారత వృద్ధి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ప్రభుత్వ గణాంకాల్లో భారత జీడీపీ ఊహించిన దానికంటే అత్యధికంగా నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత వృద్ధి వేగాన్ని గమనించిన రేటింగ్ ఏజెన్సీలు తమ అంచనాలను సవరిస్తున్నాయి. తాజాగా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ బలమైన ఆర్థిక వృద్ధి కారణంగా 2024 కేలండర్ ఏడాదికి గానూ భారత వృద్ధిని 6.1 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. 'అంచనాల కంటే బలమైన జీడీపీ వృద్ధి ఈ అప్‌గ్రేడ్‌కు కారణం. 2023లో భారత ఆర్థికవ్యవస్థ మెరుగ్గా రాణించింది. ఇది ఈ ఏడాదిలోనూ కొనసాగవచ్చు. ముఖ్యంగా జీ20 దేశాల్లోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధించగల సత్తా భారత్‌కు ఉందని' మూడీస్ తన గ్లోబల్ మాక్రో ఎకనమిక్ ఔట్‌లుక్-2024లో పేర్కొంది. 2025 ఏడాదిలోనూ భారత్ 6.4 శాతం మేర వృద్ధిని నమోదు చేయగలదని మూడీస్ అభిప్రాయపడింది. ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచడం, తయారీ కార్యకలాపాలు బలంగా ఉండటం భారత వృద్ధికి దోహదపడ్డాయని తెలిపింది.

భారత్‌లో ఎన్నికల తర్వాత కూడా విధాన కొనసాగింపు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిని కొనసాగుతుందని ' మూడీస్ భావిస్తోంది.. ఇదే సమయంలో ఈ ఏడాది భారత్, యూకే, యూఎస్ సహా అనేక జీ20 దేశాల్లో ఎన్నికలపై కూడా మూడీస్ హైలైట్ చేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే ప్రభుత్వాలు వచ్చే 4-5 ఏళ్ల్లో దేశీయ, విదేశీ విధానాలను ప్రభావితం చేయవచ్చని వెల్లడించింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, సరఫరా వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణను అభివృద్ధి చేసేందుకు వీలుంటుందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed